పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణబలరాముల యుద్దవర్ణన

రమి యుద్ధతలీలఁ దాలాంకుడంత
రదంబు వరపించి ట్టహాసమున
రలాఘవమున భీణవృత్తిఁ గురియ 
xviiమ్రగ్గె నేనుంగలు డిసెగాల్బలము 
మ్రొగ్గె రథములశ్వములుఁ గీటడంగె.   - 560 
క్షీణబలశాలిగు సిరిచేత
క్షోహిణలు పడి వనిపైఁ గూలె
రుడకేతనకాంతి గనంబుఁ గప్ప
రదంబు రప్పింప రి యాజికెఱఁగి
టుశౌర్యనిర్ముక్త బాణజాలముల
విటతాటమై కూలె వీరసంఘంబు
రివజ్రహతిఁ గూలె టవారణములు
రిమి కృష్ణుని చక్రధారలచేతఁ
రివరలైమ్రొగ్గె హుశతాంగములు
నుజారి నందకదారుణహతుల
తునకలై ధర వ్రాలె తురగసంఘములు
డవులనేర్చు దావాగ్ని చందమునఁ
డువడి శౌరి సంరకేళి సల్ప
తనితోఁ బద్నాలుక్షోహిణిలును
తమయ్యె వెస బ్రహారార్ధమాత్రమున